తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,789కి చేరింది. ఇందులో 2,82,177 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,053 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1559కి చేరింది.