మైనర్లు డ్రైవింగ్ చేస్తే సహించేది లేదు.. సిపి సజ్జనార్
హైదరాబాద్ (CLiC2NEWS): మైనర్ డ్రైవింగ్ పై పాఠశాలల్లో డీమెరిట్ పాయింట్ విధానం అమలు చేయాలని , ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ కోరారు. ఈ రోజు విద్యాసంస్థల యాజమాన్యాలతో ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ సహించేది లేదన్నారు. మైనర్లు పట్టుబడితే.. స్కూళ్ల పేర్లు పేర్కొనే పరిస్థితి తీసుకురావద్దన్నారు. స్కూల్ కాంపౌండ్ లో ఉన్నపుడు మాత్రమే కాకుండా.. విద్యార్థులు స్కూల్‌కి ఎలా వస్తూ వెళుతున్నారనేది పట్టించుకోవాలని సజ్జనార్ అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ బయట జరిగిందని తప్పించుకోవడం సరికాదన్నారు.
అంతేకాకుండా స్కూల్ బస్ డ్రైవర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారన్నారు. ఇక నుండి ఎవరైనా స్కూల్ బస్ డ్రైవర్లు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే.. స్కూల్ పేర్లను కూడా బయటపెట్టాల్సి వస్తుందని సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యానికి తెలియజేశారు.