బాగ్‌లింగంపల్లిలో కొలువుదీరిన గణనాధుడి విగ్రహాలు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరమంతా గణేషుడి విగ్రహాలతో కళకళలాడుతోంది. వీధులలో ఎక్కడ చూసిన గణపతి బప్ప మోమియా అంటూ.. వినాయకుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ గణేష్ మండపాల వద్ద పూజాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఐదవ రోజు నుండి నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. పలుచోట్ల లంబోదరుడి విగ్రహాలను మేళతాళాలతో నిమజ్జనానికి తీసుకెళుతున్నారు. యువత ఉత్సాహంగా చిందులు వేస్తూ గణేషుడిని ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించడం చూస్తూ ఉన్నాం. దీంతో నగరమంతా శోభాయమానంగా సందడి వాతావరణం నెలకొంది.
నగరంలోని బాగ్‌లింగంపల్లిలో కొలువుదీరిన గణనాధుడి విగ్రహాలు











![]()
![]()
![]()