ప్రధానికి సిఎం జగన్‌ లేఖ

అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాన‌మంత్రి నరేంద్రమోడీకి ఆంధ్ర‌ప్ర‌దేవ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ప్ర‌ధానిని లేఖ ద్వారా కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని, విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం ఫలితంగా స్టీల్‌ ఫ్యాక్టరీ వచ్చిందని గుర్తు చేశారు. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారని, నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనబరిచిందని, ప్లాంట్‌ పరిధిలో 19,700 ఎకరాల భూములున్నాయని, ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందనిచెప్పారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడంతో ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని, ప్లాంటుకు సొంతంగా గనులు లేవని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడడం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని చెప్పారు.

స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చిందని పేర్కొన్నారు. కాగా వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే… ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చుని జ‌గ‌న్ లేఖలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.