ఆంధ్రప్రరదేశ్లో ముగిసిన తొలి విడత పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఉద్రికత్త సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అని చెబుతున్నారు. మొత్తం విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లో 3249 పంచాయతీలలో పోలింగ్ జరిగింది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మంగళవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
మధ్యాహ్నం 2.30 వరకూ జిల్లాల వారీగా పోలింగ్ శాతం
- శ్రీకాకుళం 69%,
- విశాఖపట్నం 76.27%,
- తూర్పుగోదావరి 76.55%,
- పశ్చిమగోదావరి 73.55%,
- కృష్ణ 81%,
- గుంటూరు 76%,
- ప్రకాశం 73.19%,
- నెల్లూరు 76%,
- చిత్తూరు 78.06%,
- కడప 71.63%,
- కర్నూలు 79.51%,
- అనంతపురం 75.78%