గొప్ప మనసు చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తన గొప్పమనసును చాటుకున్నారు. శనివారం మంత్రి ములుగు జిల్లా పర్యటన ముగించుకొని మహబూబాబాద్‌కు వస్తున్నారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ మండలం కంబాలపల్లి వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దాంతో అటుగా వెళ్తున్న మంత్రి వెంటనే వాహనాన్ని నిలిపి గాయపడిన ఇద్దరిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. మంత్రి సత్యవతి రాథోడ్ చూపిన చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.