షేక్.బహర్ అలీ: తాడాసనం
తాడాసనం చేయు విధానం..
ముందుగా రెండు పాదాలు దగ్గరగా పెట్టి ఆసన స్థితిలో నిటారుగా నిలబడవలెను. రెండు హస్తములను పార్శ్వ భాగం నుండి పైకి లేపుతూ,దీర్ఘాశ్వాసను ఊపిరితిత్తులలోకి తీసుకుంటూ, రెండు కాళ్ళ వేళ్ళు (పంజాల) పైన నిలబడవలెను, వెనుక మడిమలు పైకి లేపి ఉంచవలెను.శరీరం యొక్క భారం అంత పంజాలపైన (కాళ్ళ వేళ్ళ)పడవలెను. శరీరం పైవైపునకు నిటారుగా ఉండవలెను. కొన్ని సెకనుల ఇలా నిలబడవలెను.
మరల శ్వాసను వదులుతూ పైకి లేపిన చేతులను కిందకు దించుతూ కాలి వెనక మడమలను నేలకు పూర్తిగా అనించాలి.
ప్రయోజనాలు
1. ఈ ఆసనం మనుష్యకృతిన ఉన్నతపరుచుటకు సర్వోత్తమైనది.
2. ఈ ఆసనం కాలి కండరములు, పిక్కలు, తొడలు, నడుము, వెన్నుముక, ఊపిరితిత్తులు, చైతన్యవంతంగా మారి దృడంగా అవుతాయి.
3. వేరికోసే వెయిన్స్ ఉన్నవారికి చాలా లాభకారిగా ఉంటుంది.
4. శ్వాసను తీసుకొని వదలడం వలన పుప్పుసములు దృడంగా మారి విస్తృతంగా అవును.
5. దీని వలన స్నాయువులన్నియు సక్రియవంతములు మరియు వికశితమగును.
6. మనం ఎక్కడైనా చాలా సేపు కూర్చున్న తరువాత నడుము నోప్పి, శరీరం బలహీనంగా అనిపిస్తే ఇలా ఈ ఆసనం వేస్తే శరీరం అంత చైతన్యవంతంగా మారును. హుషారుగా వుంటారు.శరీరం తేలికగా అవుతుంది.
7. మనం పరధ్యానంలో ఉన్నపుడు శ్వాస సరిగ్గా నడవక అవలింతలు వస్తాయి. అలాంటి సమయంలో ఈ ఆసనం వేస్తే, ఊపిరితిత్తులు శ్వాసను తీసుకోవడం వలన మరల అవలింతలు రావు.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
