వారెవ్వా..! ఏమి డ్ర‌స్సు..!

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): చాలా మంది పెంపుడు కుక్క‌ల‌ను త‌మ కుటుంబ స‌భ్యులుగా చూసుకుంటారు. వాటిని కొడుకుగానో, కూతురు గానో పిలుచుకుంటారు. చిన్న పిల్ల‌ల‌ను పెంచిన‌ట్లుగానే అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాటికేదైనా ఇబ్బంది క‌లిగితే ఆ శున‌కాల య‌జ‌మానులు ఆస‌ప‌త్రుల చుట్టూ తిరుగుతారు. వాటికి ర‌క‌ర‌కాల‌ డ్ర‌స్‌లు వేసి మురిసిపోతుంటారు. అలాంటి సంఘ‌ట‌నే ఓ కుటుంబంలో చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ ల‌క్ష్మీ న‌రిసింహ న‌గ‌ర్‌లో నివ‌సించే దంప‌తులు త‌మ పెంపుడు జంతువును (కుక్క‌పిల్ల‌ను) పెంచుకుంటున్నారు. దానికి బిట్టు అని పేరు పెట్టారు.

త్వ‌ర‌లో బిట్టు పుట్టిన రోజు రాబోతుండ‌గా ఏవిధంగా శున‌కాన్ని అలంక‌రించాలా అని ట్ర‌య‌ల్స్ వేస్తున్నార‌ట‌. దానిలో భాగంగా కుక్క‌పిల్ల‌కు షేర్వానీ వేసి, త‌ల‌పాగా పెట్టి, మొద‌లో పూస‌ల దండ‌లు సైతం వేసి అలంక‌రించి మురిసిపోతున్నారు. చూసిన‌వారంతా అరె..! డ్ర‌స్ అదుర్స్‌.. , బిట్టు పెళ్లికొడుక‌య్యాడే .. అంటూ చ‌మ‌త్క‌రిస్తున్నారు. దీన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఆ కాల‌నీ వాసులు వంతైంది. మీకు కూడా శున‌కాల మీద ప్రేమ ఉంటే.. మీ ఇంట్లో ఉన్న ప‌ప్పీస్‌కు కూడా ట్రై చేసి చూడండి

మాజి ఎంపి మాలోత్ క‌విత స్వ‌గృహంలో వ‌రల‌క్ష్మీ వ‌త్రం

Leave A Reply

Your email address will not be published.