రేయ్ రేయ్ రేయ్.. పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం..

నరేష్‌పై నాని ప్ర‌శంస‌ల జ‌ల్లు

హైదరాబాద్‌: నాంది సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో హీరో అల్ల‌రి న‌రేష్ ని ప‌లువురు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నానీ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ..
`మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘అల్లరి నరేష్‌’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను.“ అని నాని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.