సంస్కృతి ఫౌండేషన్ కరపత్రాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్
నర్సంపేట్: వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్కృతి ఫౌండేషన్ కరపత్రాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బాగంగా నర్సంపేటలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధానం పక్కన గల అన్నదాన సత్రం, గోశాల కు సంబంధించిన సంస్కృతి ఫౌండేషన్ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి, మేనేజింగ్ డైరెక్టర్ కక్కెర్ల శ్రీనివాస్, డైరెక్టర్స్ శ్రీకాంత్ శ్రీ హర్ష శర్మ, నాగ యజ్ఞ శర్మ, పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.
