రావాలి మార్పు..
రావాలి మార్పు..
మా బతుకులకు బాటలు వేయడం కోసం…
మా భవిష్యత్తుకు వెలుగులు పంచడం కోసం…
మార్పు రావాలి…
మళ్లీ పచ్చని రోజులు రావాలి…!
తెలంగాణ నీటి కోసం…
తెలంగాణ నేల కోసం…
తెలంగాణ ఆత్మగౌరవం కోసం…
న్యాయం చేసే పాలన రావాలి…!
రైతన్న కష్టాల కాలం మళ్లీ మా ముంగిట నిలిచింది…!
పాతకాలపు పరిస్థితులు
మళ్లీ మా పల్లెలను పలకరించకముందే…
మా గోడు వినే పాలన రావాలి…
మా కన్నీటిని తుడిచే భరోసా రావాలి…!
నిగురుకప్పిన నిప్పులమై
లోలోపల రగులుతున్నాం మేము…
మా గుండె చప్పుడు వినాలి…
మా పల్లెల గోడు వినాలి…!
రైతు పొలాల వైపు సుడిగాలి చూపు కాదు—
స్థిరమైన శ్రద్ధ కావాలి…!
మా చెరువులు నిండాలి…
మా బావులు పొంగాలి…
మా పొలాల్లో పచ్చదనం వెల్లివిరియాలి…
రైతన్న ముఖంలో
మళ్లీ చిరునవ్వు పూయాలి…!
రావాలి మార్పు.
-శ్రీమతి మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218

Also Read: టైం ఆగిపోతే.. — మంజుల పత్తిపాటి