మార్చి 28 నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

ముంబయి: మహారాష్ట్రలో రోజురోజుకి పెరుగుతున్న కేసుల‌ను అదుపు చేసేందుకు మార్చి 28(ఆదివారం) నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 0మరోవైపు మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం కొత్తగా 35,952 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 95 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో క‌రోన విజృంభ‌న‌కు అడ్డుక‌ట్ట వేసే చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.