దేశంలో కొత్త‌గా 62,258 కరోనా కేసులు

 న్యూఢిల్లీ: భార‌త్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్తగా 62,258 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. వీటిలో ఇందులో 1,12,95,023 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం  4,52,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 291 మంది మృతి చెందారు.  తాజా కేసుల‌తో క‌లిపి ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,240 కి చేరిందని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.