తెలంగాణలో కొత్త‌గా 463 క‌రోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,205 కి చేరింది. వీటిలో 3,00,833 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,678 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కరోనాతో రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,694 మంది మృతి చెందార‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.