దేశంలో కొత్త‌గా 56,211 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 56,211 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కి చేరింది.  ఇందులో 1,13,93,021 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,40,720 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.  దేశంలో కొత్తగా 271 మంది కరోనాతో మృతి చెందారు.  తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,62,114కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.