సాగర్‌లో బిజెపికి షాక్: టిఆర్ఎస్‌లో చేరిన కడారి అంజయ్య యాదవ్
నల్లగొండ : నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆయన అనుచరులతో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి అంజయ్య యాదవ్ ను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి కెసిఆర్. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్ చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. కడారి అంజయ్య యాదవ్‌కు.. సీఎం కేసీఆర్ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంజయ్య యాదవ్ చేరికతో సాగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మరింత పటిష్టంగా తయారైంది. సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం మొండి చెయ్యి చూపడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరారు.
దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడు.. నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా.. ఆ టికెట్ ఆశిస్తున్నవారికి గాలం వేయాలని భాగానే ప్రయత్నాలు చేశారట. అయితే, ముందే మేల్కొన్న టిఆర్ ఎస్ అధినేత టికెట్ ఆశించినవారికి కూడా హామీ ఇవ్వడంతో.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ పేరును చివరి నిమిషంలో ప్రకటించింది. కానీ, అంజయ్య యాదవ్ లాంటి నేతలు గడపదాటకుండా చూసుకోలేకపోయింది.