ఎపిలో కొత్త‌గా 993 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 900805కు చేరింది. ఇందులో 886978 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 6614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ముగ్గురు మరణించారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7213కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో ఏపీలో 480 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.