తెలంగాణలో కొత్తగా 684 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 684 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరింది. వీటిలో 3,01,227 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 4,965 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1697 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.