కమల్ గెలిస్తే `లిప్ సర్వీస్` మాత్రమే..?: వనాతి
చెన్నై: తమిళనాట మాటలు కోటలు దాటుతున్నాయి. అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షణి అసెంబ్లీ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఇక్కడి నుంచి ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ బరిలోకి దిగారు. అలాగే ఇక్కడ నుండి బీజేపీ తరఫున వనాతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. కమల్ వర్సెస్ వనాతి శ్రీనివాసన్‌గా మారిపోయింది. తాజాగా కమల్ ను ఉద్దేశిస్తూ పనాతి శ్రీనివాసన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను గెలిపిస్తే లిప్ సర్వీస్ చేస్తాడు తప్ప.. పబ్లిక్ సర్వీస్ చేయడని సెటైర్లు వేసింది. ఎంఎన్ఎం చీఫ్ రెండు రకాల లిప్ సర్వీస్ చేయగలడు.. ఒకటి మాటలతో గారడి, రెండోది ఏంటనేది నేను చెప్పక్కర్లేదు అంటూ ఎద్దేవా చేశారు. దాంతో పనాతి శ్రీనివాసన్ వ్యాఖ్యలపై కమల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించాడు.