థియేట‌ర్‌లో పేప‌ర్స్ విసురుతూ రచ్చ చేస్తున్న దిల్ రాజు

హైద‌రాబాద్‌: మూడేళ్ల త‌ర్వాత ఎంట్రి ఇచ్చినా.. `ప‌వ‌ర్` జోరు కొనసాగుతోంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల‌లో `వ‌కీల్ సాబ్` మానియా ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాష్ట్రంలోని సామాన్యులు, సెల‌బ్రిటీలు వ‌కీల్ సాబ్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రోజు సాయంత్రం త‌న ఫ్యామిలీతో క‌లిసి వ‌కీల్ సాబ్ సినిమా చూస్తానంటూ ట్వీట్ చేశారంటే మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ న‌టించిన సినిమాపై అంద‌రిలో ఎంతో ఉత్సుక‌త ఉందో అర్ద‌మ‌వుతుంది.

ఈ రోజు ఉద‌యం శివ పార్వ‌తి థియేట‌ర్‌లో వ‌కీల్ సాబ్ బెనిఫిట్ షో ప్ర‌ద‌ర్శించారు. ఈ షోకు దిల్ రాజు త‌న స‌తీమ‌ణితో హాజ‌ర‌య్యారు. అయితే వెండితెర‌పై తాను ప‌వ‌న్ చూసిన ఆ క్ష‌ణం తాను నిర్మాత‌ను అని మ‌రిచిపోయి డై హార్డ్ ఫ్యాన్‌లా పేప‌ర్స్ పైకి విసిరేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్ప‌టికే ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. ఇలా ప‌వ‌న్ ఫ్యాన్‌లా హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియోను చూస్తూ.. ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.