వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
వేములవాడ: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ నెల 21న రాజన్న సన్నిధిలో అర్చకుల సమక్షంలోనే సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి నిత్య పూజలు, సీతారాముల కల్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
