TS Corona: కొత్తగా 4801 కేసులు.. 32 మంది మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 4,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాకేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,988 కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 7430 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగా ఇప్పటి వరకు 4,44,049 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,136 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 32 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,803 కి చేరింది.