టెన్త్‌లో అంద‌రూ పాస్‌

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వం, విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజుల్లో గ్రేడ్లు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లోని 5,21,392 మంది విద్యార్థులు పరీక్షల్లేకుండానే ఉత్తీర్ణులయ్యారు. ప్రక్రియనంతా పూర్తిచేసి, వారం రోజుల్లో గ్రేడ్లు ప్రకటిస్తామని ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.