Mandapeta: `ఏడిత సీతానగరంలో 500 మందికి వాక్సినేషన్..`

మండపేట (CLiC2NEWS): మండలంలో ఏడిద సీతానగరం గ్రామంలో 500 మందికి మొదటి డోసు కొవిడ్ వాక్సిన్ వేసిన‌ట్లు సర్పంచ్ వరద చక్రవర్తి తెలిపారు. అసెంబ్లీ ఇంచార్జి తోట త్రిమూర్తులు, ఎంపీడీఓ ఐదం రాజు ఆదేశాలు మేరకు కోవిడ్ వాక్సిన్ రెండవ సారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామంలో 45 సంవ‌త్స‌రాలు దాటిన వారందరికీ వాక్సిన్ పూర్తి అయినదన్నారు.ఈ కార్యక్రమములో భాగముగా వాక్సిన్ మొదలయినప్పటి నుండి చివరి వరకు అక్కడే ఉండి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర ఉండి వాక్సిన్ కార్యక్రమo శుభప్రదం చేశామన్నారు . రెండవ డోస్ కూడా తగిన సమయంలో క్యాంప్ పెట్టి అందరికీ వాక్సిన్ వెయిస్తామని తెలియజేశారు. వాక్సినేషనకు సహకరించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి తోట త్రిమూర్తులు కు ఆయన తమ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.