TS: వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లా లోని వాసాలమర్రి గ్రామాన్ని సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌తో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు… ఈనెల 22న వాసాలమర్రిలో పర్యటిస్తానని తెలిపారు. అలాగే గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తామని, ఏర్పాట్లు చేయాలని సర్పంచ్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని సర్పంచ్‌కు హామీ ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే సునీత, కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు.