TS: వాసాల‌మ‌ర్రి సర్పంచ్​తో ఫోన్​లో మాట్లాడిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లా లోని వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సిఎం కెసిఆర్‌ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. కాగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్​తో ముఖ్యమంత్రి ఫోన్​లో మాట్లాడారు… ఈనెల 22న వాసాలమ‌ర్రిలో పర్యటిస్తానని తెలిపారు. అలాగే గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తామని, ఏర్పాట్లు చేయాలని సర్పంచ్​కు ముఖ్య‌మంత్రి సూచించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని సర్పంచ్‌కు హామీ ఇచ్చారు. కాగా ముఖ్య‌మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే సునీత, కలెక్టర్‌ పమేలా సత్పతి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.