Mandapeta: రెండో రోజు వీ ఆర్ ఏల రిలే దీక్షలు..

కనీస వేతనం రూ 20 వేలుకు పెంచాలి..

మండపేట (CLiC2NEWS): గ్రామ సేవకులు (వీ ఆర్ ఏ)లు తమ సమస్యలు పరిష్కరించమని చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మండపేటలో రెండో రోజుకు చేరాయి. వీ ఆర్ ఏల సంఘం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మండపేట రెవెన్యూ విభాగంలో పని చేసే వీ ఆర్ ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీ ఆర్ ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి ఎస్ కె రెహ్మాన్ లు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో గ్రామ సేవకులుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి అన్నారు.

దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. దశాబ్దాల తరబడి వెట్టిచాకిరి చేస్తున్న తమను ప్రభుత్వాలు గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏ లను వెంటనే చెల్లించి 300కు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కనీస వేతనం రూ 20 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు. నామినీ వీఆర్ ఏల పోస్టులు భర్తీ చేసి తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ అమలు జరిపి వీ ఆర్ ఏ లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉండ్రాసరపు గంగయ్య, పిళ్ళంగోరు నాగూర్, చంద్రరావు, వెదురీ చిట్టిబాబు, కొండూరు వీరభద్రరావు, జిత్తుక రత్తయ్య, షేక్ వలిమా,గంగరాజు వెంకటారాజు,అన్నవరం, ఇండుగమిల్లి చిన సుబ్బారావు, పివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.