Mandapeta: యాదవ సెల్ జాతీయ అధ్యక్షుడిగా కోన నియామకం

మండపేట (CLiC2NEWS): కోన సత్యనారాయణ అఖిల భారత యాదవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు డేరంగుల ఉదయ్ కిరణ్ ఆయనకు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా శనివారం టౌన్ హాల్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో కోన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంఘం హక్కుల కోసం సేవలందించి బీసీల కోసం పోరాటం చేసిన కృషి ఫలితంగా తనను గుర్తించి యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడిగా నియమించి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు డేరంగుల ఉదయ్ కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. యాదవసేన రాష్ట్ర అధ్యక్షులుగా, జిల్లా బీసీసంఘం అధ్యక్షులుగా బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీ సంఘం పునః వ్వవస్థీకరణలో భాగంగా  ఏర్పాటు చేసిన కొత్త కమిటీలలోకి తనకు స్థానం కల్పించారని అన్నారు.

బీసీల కోసం సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 50 వేల కోట్ల రూపాయలను  ప్రత్యేక బడ్జెట్ లో పెట్టాలని ఉదయ్ కిరణ్ కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. సబ్ ప్లాన్ నిధులు ఎలాంటి షరతులు లేకుండా నేరుగా బీసీ అభ్యర్ధుల ఖాతాల్లోకి చేరేలా చూడాలని కోరారని తెలిపారు. కరోనా ప్రభావం వల్ల లక్షలాది మంది బీసీలు ఉపాథి లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. వారందరికీ 5 లక్షల రూపాయలు సహాయం అందించి ఆదుకోవాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.