జనసేన జిల్లా కమిటీలో మండ‌పేట నుంచి ముగ్గురికి స్థానం

మండపేట (CLiC2NEWS): జనసేన పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా కమిటీలో మండపేట నియోజకవర్గం నుండి ముగ్గురికి స్థానం దక్కింది. వీరిలో మండపేట మండలం పాలతోడు గ్రామం కు చెందిన  సరాకుల అబ్బులు ప్రధాన కార్యదర్శి గా నియమితులయ్యారు. కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగ గ్రామం కు చెందిన కొమ్మిశెట్టి సూరిబాబు కార్యదర్శిగా నియమితులయ్యారు.  రాయవరం మండలం చెల్లూరు గ్రామం కు చెందిన
దాలపర్తి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. మండపేట నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నియమితులైన సరాకుల అబ్బులు, కొమ్మిశెట్టి సూరిబాబు, దాలపర్తి శ్రీనివాస్ లు మాట్లాడుతూ తమను నియమించిన అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.