పోలీసుల త్యాగాలు మరువలేనివి: ప్ర‌ధాని మోడీ

పోలీసు వ్యవస్థపై ఉన్న వ్యతిరేక దృక్ప‌థాన్ని తొలగించండి

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్రజల్లో పోలీసు వ్యవస్ధపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారులపై ఉందని ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి వర్చువల్‌గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా వారికి దిశా నిర్దేశం చేశారు.

ఐపీఎస్‌ అధికారులు విధుల్లో భాగంగా దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత మీ అందరిపై ఉందని ప్రొబెషనరీ ఐపీఎస్‌లకు ప్రధాని స్పష్టం చేశారు. పోలీసుల త్యాగాలు మరువలేనివి ఆయ‌న అన్నారు. దేశ రక్షణలో ఎంతో మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు అర్పించిన విషయాన్ని కూడా మోడీ ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న వ్యతిరేక భావాన్ని చెరిపేయాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌లపై ఉందని ప్ర‌ధాని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.