49 ఏళ్ల తర్వాత సెమీస్​లో భారత హాకీ జట్టు

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్‌లో భార‌త హాకీ పురుషుల జ‌ట్టు అద‌ర‌గొట్టింది. క్వార్ట‌ర్స్ ఫైన‌ల్స్‌లో బ్రిట‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 3-1 గోల్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించి సెమీస్​లోకి దూసుకెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత భార‌త్ ఈ ఘనత సాధించింది. ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. 49 ఏళ్ల విరామం తర్వాత సెమీస్​కు అర్హత సాధించింది.

మ్యాచ్ తొలి క్వార్ట‌ర్ లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయ‌గా.. రెండో క్వార్ట‌ర్‌లో 16వ నిమిషంలో గుర్జ‌త్ సింగ్ మ‌రో గోల్ సాధించాడు. హార్దిక్ సింగ్(57వ) గోల్స్ చేశారు. బ్రిటన్ జట్టులోని సామ్ వార్డ్​ ఏకైక్ గోల్ చేశాడు.

గ్రేట్​ బ్రిటన్​తో ఆదివారం జరిగిన ఈ క్వార్టర్స్​ ఫైనల్​ మ్యాచ్​లో 3-1 తేడాతో గెలిచిన భార‌త్ సెమీస్​లో బెల్జియంతో మంగళవారం తలపడనుంది.

1972 ఒలింపిక్స్​లో చివరగా సెమీస్​ ఆడిన భారత జట్టు.. పాకిస్థాన్​ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది.

Leave A Reply

Your email address will not be published.