Tokyo Olympics: 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్‌కు పతకం
టోక్యో (CLiC2NEWS) : ఒలింపిక్స్‌లో భారత్ హాకీ సేన కాంస్య పతకం సాధించింది. ప్రత్యర్ధి అయిన జర్మనీతో తలపడిన మన్‌ప్రీత్‌సింగ్ సేన విజయం సొంతం చేసుకుంది. మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్) , శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్ రూపిందర్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, సురేందర్ కుమార్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, మన్‌దీప్ సింగ్ దాల్ ప్రీత్‌సింగ్ ఈజట్టులో ఉన్నారు. హాకీలో సాధించిన కాంస్య పతకంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 5కు చేరింది. 1980 వ సంవత్సరంలో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ చివరి సారి స్వర్ణ పతకం సాధించిన సంగతి విదితమే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన ఈ విజయం భారత్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.