TS: ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రి ద‌ళితుల‌కు ఇచ్చిన మాట‌ను సిఎం నిల‌బెట్టుకున్నారు. నిన్న ఇచ్చిన హామీ మేర‌కు గురువారం ఆ గ్రామానికి ద‌ళిత బంధు నిధుల‌ను విడుద‌ల చేశారు. వాసాల‌మ‌ర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు రూ. 7.60 కోట్లు ఇవాళ‌ విడుద‌ల చేశారు. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ద‌ళితుల సంబురాలు

ద‌ళిత బంధు నిధులు విడుద‌ల కావ‌డంతో వాసాల‌మ‌ర్రి ద‌ళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

వాసాల‌మ‌ర్రిలో సిఎం కెసిఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం
Leave A Reply

Your email address will not be published.