చిరు లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే నున్నటి గుండుతో అర్బన్ మాంక్ గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. సడెన్ గా గుండూబాస్ గెటప్ లో చిరు కనిపించేసరికి ఆశ్యర్యపోవడం అభిమానుల వంతైంది. చిరు సడెన్ గా ఇలా కనిపించే సరికి ఏ సినిమా కోసం ఇలా రెడీ అయ్యారోనని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా చిరంజీవి తన లుక్ వెనకున్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు అర్బన్ మాంక్ లుక్‌లోకి తాను ఎలా మారాననే విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. “నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. మేజిక్ ఆఫ్ సినిమాకు సెల్యూట్” అని చిరు వీడియోతో పాటు మెసేజ్ కూడా షేర్ చేశారు. తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న సీక్రెట్ ప్రాస్థటిక్ మేకప్ అనే మొత్తానికి రివీల్ చేశారు మెగాస్టార్. కాగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆచార్య లో నటిస్తున్నాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్..కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షురూ కానుంది. మరోవైపు చిరంజీవి లూసిఫర్, వేదాళమ్ రీమేక్ లలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దీంతో చిరు ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక దాంట్లో నున్నటిగుండు లుక్ లో కనిపిస్తాడేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. (మెగాస్టార్ కొత్త అవతారం!)
View this post on Instagram