TS: రాష్ట్రంలో మూడు రోజులు ముసురే..!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. అది తెలంగాణ, ఏపీ మీదుగా 3.1 ఎత్తున ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తాయని పేర్కొంది. శనివారం ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇవాళ (శుక్రవారం) ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.