మియాపూర్ సామూహిక లైంగికదాడి కేసు: ఆగురికి జీవితఖైదు
హైదరాబాద్ (CLiC2NEWS): మియాపూర్ లో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు రంగారెడ్డి జిల్లా ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక సెషన్స్ న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ముద్దాయిలకు రూ.20,000 చొప్పున జరిమానా విధించింది.
పీపీలు ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి కథనం ప్రకారం..
శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌కు చెందిన షేక్ షౌకత్ (35), మహ్మద్ ఖాలిద్ అలియాస్ అబ్బు (22), మహ్మద్ అఫ్రోజ్ అలియాస్ లాల్ (20), అబ్దుల్ సల్మాన్‌ఖాన్ అలియాస్ రైడర్ (20), షేక్ సల్మాన్ (22), ముజాహిద్‌ఖాన్ అలియాస్ షారూఖ్ (20), మరో బాలుడు (17) కలిసి 2019వ సంవత్సరం జనవరి 19 వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో హఫీజ్‌పేట రైల్యే స్టేషన్ సమీపంలో వెళ్తున్న యువతి (25)ని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అత్యాచారం కేసులో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో రంగారెడ్డి జిల్లా ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులకు జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి జయలక్ష్మి ఆరుగురు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఓ మైనర్ కూడా ఉండడంతో.. అతడి కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో పెట్టింది.