ఆ రాష్ట్రంలో మళ్లీ నైట్ క‌ర్ఫ్యూ..

గువాహ‌తి (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక‌వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మ‌రం చేసినా.. క‌రోనా కేసులు రోజువారీ న‌మోదు ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో మ‌ర‌లా ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. కేర‌ళ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా అసోం రాష్ట్రంలో కూడా నైట్ క‌ర్ఫ్యూను విధిస్తున్న‌ట్టు అక్క‌డి రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌క‌టించింది. రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు షాపులు, రెష్టారెంట్లు, వ్యాపార స‌ముదాయాలు మూసివేయాల‌ని ఆదేశించింది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసే ఉంటాయ‌ని, త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు తెర‌వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అసోం ప్రభుత్వం బుధవారం కొత్త COVID-19 మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గత వారం రోజులలో ఏ ప్రాంతంలోనైనా కోవిడ్ పాజిటివ్ కేసులు 10 కి చేరుకున్నట్లయితే, అలాంటి ప్రాంతాలను మొత్తం కంటైన్‌మెంట్ జోన్‌లుగా గుర్తించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. నేటి నుండి తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆంక్ష‌లు అమలులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.