టిఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్
హైదరాబాద్ (CLiC2NEWS): సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలను అనంతరం సజ్జనార్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై విషయాలపై చర్చించారు.
మూడేళ్ల పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పని చేసిన సజ్జనార్ నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు.