`సాగర్` 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జున సాగర్ (CLiC2NEWS): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వరదతో పాటు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- నాగార్జునసాగర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
- నారిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 8718 క్యూసెక్కులు
- కుడి కాల్వ ద్వారా 8831 క్యూసెక్కు లు,
- ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు
- ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28095 క్యూసెక్కులు
- వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
- సాగర్ నుంచి 80594 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో
ఇన్‌ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది.