భారతీయ రైల్వేలో 492 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ (CLiC2NEWS): వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ అప్లికేషన్లు అక్టోబరు 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 492 అప్రెంటిస్‌లను భర్తీ చేస్తున్నది. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం అప్రెంటిస్‌లు: 492
ఖాళీలు వివరాలు..
- ఎలక్ట్రిషన్ 112
- మెషినిస్ట్ 56
- వెల్డర్ 88
- ఫిట్టర్ 200
- టర్నర్ 20
- పెయింటర్ 12
- ఏసీ మెకానిక్ 4
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 10
పూర్తివివరాలకు వెబ్‌సైట్: apprenticeshipindia.org