హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్: మంత్రి కెటిఆర్
ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ త్వరలోనే నైట్ బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కెటిఆర్ శుక్రవారం శాసనమండలిలో ప్రకటించారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఏర్పాట్లను చేస్తున్నది. దాదాపు 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నైట్ బజార్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు.
హైదరాబాద్‌లోని చార్మినార్ చుడీ బజార్, కోఠీ బడీ చౌడీ, సుల్తాన్‌బజార్ తరహాలో అన్ని సౌకర్యాలు ఉండేలా 150 నుంచి 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దుకాణాల్లో అన్ని రకాల వస్తువులను విక్రయించనున్నారు.