AP: వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
విజయవాడ:(CLiC2NEWS) ఎపి ముఖ్యముంత్రి జగన్మోహన్రెడ్డి వివిధ రంగాల్లో విశిష్టమైన ప్రతిభ కలిగిన వారికి ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలను నవంబరు 1 వ తేదీన అందజేయనున్నారు. సంస్కృతి, కళలు, సాహిత్యం, వ్యవసాయం మొదలగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన 62 మందికి ఈ అవార్డలను అందజేయనున్నారు. ఎంపికైన వ్యక్తులకు ఈ వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తోపాటు రూ. 10 లక్షల నగదు అందజేయనున్నారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాల్లో జరగనుంది. సిఎం కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కలెక్టర్ జె. నివాస్ తదితరులు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు.