National Film Awards: `దాదాసాహెబ్ ఫాల్కే` పుర‌స్కారం అందుకున్న ర‌జ‌నీకాంత్‌

ఉత్త‌మ‌న‌టి కంగ‌నా ర‌నౌత్, ఉత్త‌మ న‌టుడు ధ‌నుష్

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌తీయ చ‌ల‌న చిత్ర రంగంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల ప్ర‌దానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో నిర్శ‌హించారు. 67వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల కార్యక్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సినీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే `దాదాసాహెబ్ ఫాల్కే` అవార్డు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను వ‌రించింది. ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టులు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉత్త‌మ‌న‌టిగా కంగ‌నా ర‌నౌత్, ఉత్త‌మ న‌టుడుగా ధ‌నుష్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగులో జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాల‌కు నాలుగు విభాగాల్లో అవార్డులు వరించాయి.

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు:

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి
ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)
ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)

Leave A Reply

Your email address will not be published.