AP: ఎఐటిటి ర్యాంక‌ర్ల‌కు ఎపిఐఐసిలో ఉద్యోగాలు

ఒక్కో విద్యార్థికి రూ. 5ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహం

అమరావ‌తి (CLiC2NEWS):అంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌ఎఐటిటిలో ప‌దిలోపు ర్యాంకులు సాధించిన ఐదుగురు విద్యార్థుల‌కు రూ.5ల‌క్ష‌ల న‌గ‌దును ప్ర‌క‌టించారు. ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ఎఐటిటి)లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఎపికి చెందిన విద్యార్థులను క్యాంపు కార్యాల‌యంలో ‌ సిఎం అభినందించారు. ఒక్కో విద్యార్థికి రూ.5ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహం, వారి చ‌దువుకు అనుగుణంగా ఎపిఐఐసిలో ఉర్యోగ‌మిస్తామ‌ని తెలిపారు. వీరితో పాటు కౌశ‌లాచార్య అవార్డు సాధించిన డిప్యూటి ట్రైనింగ్ ఆఫీస‌ర్ వై. ర‌జిత ప్రియ‌ను సిఎం అభినందించారు. ఆమెకు కూడా రూ.5ల‌క్ష‌ల ప్రోత్సాహం ప్ర‌క‌టించారు. ఈకార్య‌క్ర‌మంలో మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, త‌దిత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ఎఐటిటి–2020 ఆల్ ఇండియా టాపర్స్‌ :

  • డి.మణికంఠ,   మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌           –సెకండ్‌ ర్యాంక్‌
  • మొండి సతీష్,   ఎలక్ట్రీషియన్                   –ఐదో ర్యాంక్‌
  • ఎన్‌.కుమారి,   ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్          –ఆరో ర్యాంక్‌
  • ఎం.బాల పవన్‌ రాజు,   డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్    –ఎనిమిదో ర్యాంక్‌
  • ఎం.రోషణ్,   మెకానిక్‌ ఆర్‌ అండ్‌ ఏసీ ట్రేడ్  –తొమ్మిదో ర్యాంక్‌.
Leave A Reply

Your email address will not be published.