పెద్ద‌పెల్లి, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో స్వ‌ల్ప భూకంపం

భయంతో పరుగులు తీసిన జనాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో కొమురం భీం ఆసిఫాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండో సారి. దీంతో ఆ జిల్లా వాసులు భయాందోళనకుల గురవుతున్నారు.

ఆదివారం సాయంత్రం పెద్ద‌పెల్లి, జగిత్యాల జిల్లాలలో భూమి స్వల్పంగా కంపించింది. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాయంత్రం 6:49 నిమిషాలకు దాదాపు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గతవారం కూడా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించిన విష‌యం తెలిసిందే.
అయితే ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. తరచూ గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో భూమి కంపించడంతో దీనిని ఆనుకొని ఉన్న గ్రామాలు, పట్టణాల ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. భూకంపం రావడంతో బోగ్గు గనుల్లో ఉన్న కార్మికులను అధికారులు ఖాళీ చేయించారు.

Leave A Reply

Your email address will not be published.