శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌ (CLiC2NEWS): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ప్రయాణికులను సీఐఎస్‌ఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ బృందం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో సయ్యద్‌ ఖలీద్‌ అనే ప్ర‌యాణికుడి వద్ద రూ.13 లక్షలు విలువచేసే సౌదీ కరెన్సీ ప‌ట్టుబ‌డింది. అధికారులు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.