`రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు`
తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలో జరిగిన 29వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరైన ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించారు. ఎపి సిఎం జగన్ రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. ఎపి, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణి కూడా జరగలేదన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పోలవరం ప్రాజెక్టు ఖర్చు నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో ఎపికి అన్యాయం జరుగుతోందని, ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించమని, తీవ్ర కష్టాల్లో ఉన్న ఎపి డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధించడం సరికాదని అన్నారు. ఋణాల కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిఎం ప్రస్తావించిన సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.