టి20 ప్రపంచకప్‌ 2021 విజేత ఆస్ట్రేలియా

దాదాపు 14 యేళ్ల త‌మ న‌రీక్ష‌ణ‌కు తెర‌దించుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ పోరులో టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్‌ మార్ష్‌ (46 బంతుల్లో 78 పరుగులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెల‌రేగి ఆడాడు. అతనికి తోడుగా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి వీర‌విహారం చేశాడు.

అటు న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్ ఒక్క‌డే 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

కీల‌క‌మైన టాస్‌..
మ‌రోసారి ఈ మ్యాచ్‌లో టాస్ కీల‌కంగా మారింది. టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌పాటు ఆచితూచి ఆడిన న్యూజీలాండ్ ఆఖ‌ర్లో దు్ము రేపింది. దీనికి కార‌ణం కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(85 పరుగులు, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌ వుడ్‌ 3, ఆడమ్‌ జంపా ఒక వికెట్‌ తీశాడు.

Leave A Reply

Your email address will not be published.