ఎపి, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం!
హైదరాబాద్ (CLiC2NEWS): గత వారం తీవ్ర వర్షాలతో సతమతమవుతున్న తమిళనాడు కోలుకోక ముందే, ఐఎండి మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎపి, తెలంగాణ, తమిళనాడు, కేరళలో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి ఉత్తర తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఆంధ్ర, ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
దీని ప్రభావంతో ఎపి, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఐఎండీ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అటు ఏపీలోనూ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అటు తమిళనాడు, కేరళ, ఒడిశాలోనూ అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.