TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్టీసీ శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ చెప్పంది. అయ్యప్ప స్వాములు, భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
వివరాలు..
- సూపర్ లగ్జరీ బస్సులు (36 సీట్లు) కిలోమీటర్‌కు రూ. 48.96 చొప్పున
- డీలక్స్ బస్సులు (40 సీట్లు) కిలోమీటర్ రూ. 47.20 చొప్పున
- డీలక్స్ బస్సులు (48 సీట్లు) రూ.56.64 చొప్పున
- ఎక్స్‌ప్రెస్ బస్సులు (49 సీట్లు ) రూ. 52.43 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఈ బస్సులన్నింటికీ గంటకు రూ. 300 చొప్పున వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
@tsrtcmdoffice @TSRTCHQ
Ayyappa Devotees are requested to utilize TSRTC Buses for their pilgrimage, Details are furnished below. pic.twitter.com/rR6wauHc3Y— RM NZB TSRTC (@RM_NZB) November 13, 2021